Wine | గ్రామంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి సమావేశమయ్యారు. బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామస్తులు బెల్ట్ షాపులను నిషేధిస్తూ ఇంద్రియాల గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
గ్రామంలో బెల్ట్ షాపులు ఉండకూడదని అందరూ ప్రతిజ్ఞ చేశారు. మద్యం విక్రయిస్తే 25 వేల రూపాయల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి 5000 రూపాయలు బహుమానమని ప్రకటించారు. బెల్ట్ షాపులను గ్రామస్తులు నిషేధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.