Ambedkar Ground | సూర్యాపేట రూరల్, మార్చి 2 : విద్యార్థులు అంబేద్కర్ గ్రౌండ్లో ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేసేందుకు ఎవరి కోసం ఎదురుచూడలేదు. విద్యార్థులంతా కలిసి రంగంలోకి దిగిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా మార్చివేసి.. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.
సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం గ్రామం అంబేద్కర్ గ్రౌండ్ లో నిల్వ ఉన్న చెత్త చెదారం ను చూసి కాలనీ విద్యార్థులు ఆదివారం స్వయంకృషితో గ్రౌండ్ లో ఉన్న చెత్తాచెదారాలను తీసివేసి పరిశుభ్రం చేశారు.
గ్రౌండ్ పరిశుభ్రంగా ఉంచాలని ఆటలు ఆడుకోవడానికి ఈ పరిశుభ్రతను చేపట్టామని విద్యార్థులు తెలిపారు. కాలనీ ప్రజలు చెత్త చెదారం గ్రౌండ్ లో వెయ్యకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రత్న రాజ్, శశి, లక్కీ, పార్ధు, చెర్రీ, శ్రీరామ్, అరవింద్, నాని, భగత్, రిషి, మనోజ్, గౌతమ్, బిట్టు, సన్నీ, బన్నీ, నవదీప్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?