కోటపల్లి : ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించిన హమాలీ ( Hamali ) కుటుంబానికి సహచర హమాలీలు అండగా నిలిచారు. మంచిర్యాల (Manchyryala) జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ శివరాత్రి రోజున గోదావరి నది స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడి మరణించాడు.
అతని కుటుంబానికి ఆ గ్రామ హమాలీలు గ్రామంలోని కాల భైరవ హమాలీ సంఘం ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సంఘం అధ్యక్షులు తాళపెల్లి బాపు, ఉపాధ్యక్షులు మారపాక రాజేష్ ల ఆధ్వర్యంలో అందచేశారు. ఆపద సమయంలో నిరుపేద కుటుంబానికి తమ వంతు సహాయం అందచేసిన హమాలి సంఘం సభ్యులను గ్రామస్తులు అభినందించారు.