Inter Exams | మిర్యాలగూడ, మార్చి 3: ఇంటర్మీడియట్లో పది నిమిషాల నిబంధనకు సడలింపు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన హైద్రాబాద్‌లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్యను కలిసి వినతిపత్రం అందచేశారు.
ఈ సందర్భంగా జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో.. లక్షలాది మంది విద్యార్థులకు పెనుభారంగా మారనున్నందని అన్నారు. గ్రామీణ విద్యార్థులకు సకాలంలో బస్సులు అందకపోవడం, పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య వల్ల విద్యార్థులు సమయానికి పరీక్షలకు హాజరు కాలేని పరిస్థితులు ఉంటాయన్నారు.
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పది నిమిషాల సడలింపు ఇవ్వాలని కోరారు. జాజుల లింగంగౌడ్ వెంట బూర శ్రీనివాస్‌గౌడ్, బండి నరేష్, చంద్రమోహన్ రాయ్, గోదా రవీందర్ తదితరులు ఉన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు