Farmer | కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని మిర్యాలగూడ రైతు వాపోయారు. సదరు రైతన్న మీడియాతో మాట్లాడుతూ.. యూరియా బస్తాలకు యాప్‌కు తీసుకువచ్చే. కరెంట్ కట్ అయితుండే.. రైతు బంధు అప్పుడు ఇప్పుడేనాయే.. ఏం ఇచ్చిండు.. యాప్ అంటుంటే ఏం యాప్ తెచ్చిండు.. అది అందరితో అయ్యే పని కాకపోయే. ఒకవేళ యాప్‌లో పెట్టి కొనుక్కున్నోళ్లకు కూడా యూరియా వస్తలేదన్నారు.
1000 రోజులు పూర్తయిందని వాళ్ల వరకే పండుగ చేసుకుంటున్నరు. వాళ్లు బాగున్నరు కాబట్టే వాళ్లు పండుగ చేసుకున్నరు. రైతులకు పండగ లేదు.. ఎండుగ ఉందని ఫైర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి రైతు బిడ్డనంటే మంచి చేయాలనుకుంటే మేమైనా వద్దన్నమా..? నీళ్లు, కరెంట్ ఇచ్చి అన్ని ఇస్తే మేమెందుకు అంటం.. ఇయ్యమను ఇస్తే మంచిదేనన్నారు. నేను మళ్లీ గెలుస్తా అని ఆయన మస్తుగా మాటలు చెప్తే సరిపోతదా..? ఈ ప్రజలు ఓటేయ్యొద్దా..? నీ కండ్లల్లో వేలు గుచ్చిన తర్వాత యెట్లా కనిపిస్తయ్.
కండ్లళ్ల వేలు గుచ్చకుంటేనే కదా చూసేది.. పైసలిచ్చినా.. ఎన్ని వేలు ఇచ్చినా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. కేసీఆర్ అంత బాగా చేసినా ఓడిపోయారు.. ఏదో మార్పు వస్తది.. ఏమో చేస్తడట అన్ని ఇన్ని ఆశలు పెడుతుండని రేవంత్ రెడ్డికి ఓటు వేసిర్రు. ఎండబెట్టేదే మార్పు వచ్చింది.. ఏపీకి నీళ్లు ఎందుకు తీసుకుపోతుర్రని అడగలేక వాళ్లకు దాసోహయ్యిండంటూ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది
యూరియా బస్తాలు లేవు, కరెంటు లేదు, రైతుబంధు లేదు
కాంగ్రెస్ వాళ్లు మాత్రమే మంచిగా ఉన్నారు కాబట్టి 1000 రోజుల పండగ చేసుకుంటున్నారు.. మా రైతులకి పండగ లేదు
కేసీఆర్ అంత మంచిగా చేసినా ఓడిపోయాడు.. రేవంత్ రెడ్డి చేసినవాటికి మళ్లీ… https://t.co/V1G1kZiBlq pic.twitter.com/0iQ1VCgsw4
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు