January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
January 12 Vidudala | స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ జనవరి 12న విడుదల. అనిల్ రావిపూడి సినిమాలకు ఉండే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్కు తోడు.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
January 12 Vidudala | స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ జనవరి 12న విడుదల. అనిల్ రావిపూడి సినిమాలకు ఉండే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్కు తోడు.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలోనే చిత్రబృందానికి కొత్త సమస్య ఎదురైంది. ‘జనవరి 12 విడుదల’ షూటింగ్‌కు లీకుల బెడద మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.
ప్రస్తుతం ‘జనవరి 12 విడుదల’ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. తాజాగా వీరంతా కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్న సమయంలో తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోలను బట్టి చూస్తే.. వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి నలుగురూ ఒకే పాటలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. లీకైన క్లిప్స్‌లో కనిపిస్తున్న విజువల్స్‌తో అప్పుడే సంక్రాంతి పండుగ వాతావరణం వచ్చేసిందంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన కీలకమైన విజువల్స్ ముందుగానే బయటకు రావడం మాత్రం చిత్రబృందానికి ఇబ్బందికరంగా మారింది.
సినిమాకు సంబంధించిన లీకైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని చిత్రబృందం అభిమానులను కోరుతున్నారు. లీకైన కంటెంట్‌ను తొలగించే చర్యలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూటింగ్ దశలోనే బయటకు రావడం వల్ల సినిమాపై మేకర్స్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ముందుగానే రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి సినిమాకు షూటింగ్ సమయంలో లీకులు రావడం ఇదే తొలిసారి కాదనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

