KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
KTR | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనం చుట్టూ మహిళలు రాఖీలతో సందడి చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్‌కు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చేతినిండా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు.
KTR | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనం చుట్టూ మహిళలు రాఖీలతో సందడి చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్‌కు తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు చేతినిండా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం భారీ క్రేన్‌తో గజమాల వేసి సన్మానించారు.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అలుగునూరులో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘కేటీఆర్ జిందాబాద్’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ గజమాలతో కేటీఆర్‌ను సన్మానించారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ కరీంనగర్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కేటీఆర్ వెళ్తుండగా ఈ స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేటీఆర్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కరీంనగర్‌కు బయలుదేరారు.
కేటీఆర్ వాహనానికి స్వల్ప డ్యామేజ్
అలుగునూరు చౌరస్తా నుంచి కేటీఆర్ తన కారులో కాన్వాయ్‌తో కరీంనగర్‌కు బయలుదేరే సమయంలో వాహనానికి స్వల్ప డ్యామేజ్ జరిగింది. వెనుక డోర్ తెరిచే క్రమంలో పక్క నుంచి వెళ్తున్న లారీ తగలడంతో కారు డోర్ దెబ్బతిన్నట్లు సమాచారం. ఆ సమయంలో కేటీఆర్‌కు మహిళలు రాఖీలు కడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం కేటీఆర్ తన పర్యటనను కొనసాగిస్తూ కరీంనగర్‌కు వెళ్లారు.

Ktr Vehicle
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

