NIMAS | దిరాంగ్ (Dirang)లోని 20 మంది సభ్యులు గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (MIMAS) బృందం ఒక మైలురాయిని చేరింది. ఈ బృందం లడఖ్‌లోని ఒక్కొక్కటి ఆరువేల మీటర్ల పైగా ఎత్తున్న, ఎవరూ ఎక్కని 20 పర్వత శిఖరాలను 23 రోజుల్లో అధిరోహించారు. లడఖ్ పర్వత శ్రేణిలోని చమ్సర్-లుంగ్సర్, గ్యామా నాలా, చోకులా ప్రాంతాల్లో ఉన్న వీటిని ఇంతకుముందు ఎవరూ అధిరోహించలేదు. ఈ బృందానికి కల్నల్ రణ్వీర్ సింగ్ జమ్వాల్ నాయకత్వం వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఈ బృందాన్ని ప్రశంసించారు.
అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో పర్వతారోహణ, సాహ క్రీడల్లో భారతదేశ సామర్థ్యాలను నిరూపించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్ తరాలకు పర్వతారోహణపై స్ఫూర్తినిచ్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఈ బృంద పర్వతారోహణ ముగింపు కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ కూడా హాజరయ్యారు.