‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం బూర్గంపహాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది, వైద్యుల హాజరు, రోగులకు అందిస్తున్న...
– గైనకాలజిస్ట్ రోజు విడిచి రోజు రావడం పట్ల కలెక్టర్ అంకిత్ అసహనం
– బూర్గంపహాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
బూర్గంపహాడ్, నవంబర్ 09 : ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం బూర్గంపహాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది, వైద్యుల హాజరు, రోగులకు అందిస్తున్న సేవలు, మందుల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంపై మెడికల్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. గైనకాలజిస్ట్ రోజు విడిచి రోజు విధులకు హాజరవుతున్నారని మెడికల్ అధికారి తెలపడంతో కలెక్టర్ డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి గైనకాలజిస్ట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులు, మహిళా రోగులకు వైద్య సేవలందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రక్త పరీక్షల కేంద్రాన్ని సందర్శించి పరీక్షల సంఖ్య, అందుబాటులో ఉన్న పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలు, ఎదురయ్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం వైద్య సిబ్బంది బాధ్యత అన్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా నిరంతరం పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న ఆహార పదార్ధాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి వంట మనిషితో మాట్లాడి రోగులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, తయారీలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇన్ పేషెంట్ వార్డులో 15 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని నిర్మాణ పూర్తిపై ఆరా తీశారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గడ్డం ప్రసాద్, వైద్యులు అమరేందర్‌రెడ్డి, ఇతర వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

