Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, రోజువారీ పనులతో బిజీగా ఉండే మహిళలు చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సంప్రదాయాలను పాటించడం, ఉపవాసాలు చేయడం, కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడంపై శ్రద్ధ చూపుతున్నప్పటికీ, తమకు అవసరమైన పోషకాహారం తీసుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరిచిపోతుంటారు.
Proteins | కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, రోజువారీ పనులతో బిజీగా ఉండే మహిళలు చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సంప్రదాయాలను పాటించడం, ఉపవాసాలు చేయడం, కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడంపై శ్రద్ధ చూపుతున్నప్పటికీ, తమకు అవసరమైన పోషకాహారం తీసుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరిచిపోతుంటారు. తగినంత ప్రొటీన్ తీసుకోకపోవడం, రక్తహీనత, ఎముకల బలహీనత, గుండె జబ్బుల ముప్పు వంటి సమస్యలు భారతీయ మహిళల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల మహిళలతో పోలిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు భారతీయ మహిళల్లో చిన్న వయసులోనే మొదలవుతున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
మహిళలు చిన్న వయసు నుంచే ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వారు సూచించారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగినంత ప్రొటీన్ లేకపోవడం, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయకపోవడం వల్ల కాలక్రమేణా కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే వయసు పెరిగిన తర్వాత కూడా చురుకుగా, స్వతంత్రంగా జీవించవచ్చు. భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు ఎంతో నియమంగా ఉపవాసాలు చేస్తారని, అదే క్రమశిక్షణను తమ ఆరోగ్యం కోసం కూడా పాటించాలని వారు చెబుతున్నారు. భారతీయ మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ఇతర మహిళలతో పోలిస్తే 10 నుంచి 20 ఏళ్ల ముందుగానే మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే భారతీయ మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. గుండె జబ్బులు కూడా భారతీయ మహిళల్లో దాదాపు పదేళ్లు ముందుగానే వస్తున్నాయని, క్యాన్సర్ కంటే గుండె జబ్బుల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు.
రెండు అలవాట్లు తప్పనిసరి..
మహిళలు ముఖ్యంగా రెండు అలవాట్లను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచించారు. మొదటిది రోజువారీ ఆహారంలో తగినంత ప్రొటీన్ తీసుకోవడం. రోజుకు సుమారు 80 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని, కేవలం 30 గ్రాములతో సరిపెట్టుకోవద్దని వారు సూచించారు. భారతీయ ఇళ్లలో పప్పులు ప్రొటీన్‌కు సాధారణ వనరుగా ఉన్నప్పటికీ, వాటితోనే రోజువారీ అవసరాలు తీరవని వివరించారు. ప్రతి ఒక్కరి శరీర అవసరాలకు అనుగుణంగా ప్రొటీన్ పరిమాణాన్ని తెలుసుకోవాలని, భోజనం తర్వాత తరచూ కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగితే జీర్ణక్రియపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు.
బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి..
రెండోది వారానికి కనీసం రెండు నుంచి మూడు రోజులు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం. కండరాల బలం కేవలం అందం లేదా శరీర ఆకృతి కోసం మాత్రమే కాదని, వృద్ధాప్యంలో నడవడానికి, కుర్చీలో నుంచి సులభంగా లేవడానికి, పడిపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలు పెద్దలను చూసి అలవాట్లు నేర్చుకుంటారని, ఇంట్లోని మహిళలు మంచి ఆహారం తీసుకోవడం, తగినంత ప్రొటీన్ తీసుకోవడం, వ్యాయామం చేయడం చూసి పెరిగే బాలికలు కూడా తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకుంటారని, కనుక మహిళలు కుటుంబ బాధ్యతలతోపాటు వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ద వహించాలని నిపుణులు వివరించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

