Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Techie Stabbed To Death | ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఒక మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో ఆ మహిళ అతడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో పాటు ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా: ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఒక మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో ఆ మహిళ అతడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో పాటు ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. (Techie Stabbed To Death) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల సార్థక్ సర్కార్ ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. గరియా ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. సంచాలికా బసుతో కలిసి అందులో సహజీవనం చేస్తున్నాడు.
కాగా, నవంబర్ 7న రాత్రి వేళ సార్థక్, సంచాలికా జంట మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ పదునైన కత్తితో అతడ్ని పొడిచింది. సార్థక్ అరుపులు విన్న పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సార్థక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంచాలికాతో పాటు ఆమె తల్లి మౌమితా బసుకూ కూడా సార్థక్ హత్యలో ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేవలం గొడవ వల్లనే టెక్కీ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణం ఉన్నదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

