West Indies | భారత గడ్డపై విండీస్ చెత్తాట.. 24 ఏళ్లలో ఒక్క వన్డే సిరీస్ గెలవలే..!
West Indies : గత 24 ఏళ్లలో విండీస్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. దాంతో.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలంటే షాయ్ హోప్(Shai Hope) బృందం సర్వశక్తులు ఒడ్డాల్సిందే.
West Indies : స్వదేశంలో భారత జట్టును ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. ఇటీవల కాలంలో కొన్ని మ్యాచుల్లో ఓడినా.. సొంతగడ్డపై టీమిండియా గర్జించే పులిలాంటిది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ (West Indies)ను ఢీ కొడుతోంది. తిరువనంతపురంలో తొలి మ్యాచ్‌తో సిరీస్ షరూ కానుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్లు నెట్స్‌లో బ్యాటింగ్ సరి చూసుకుంటున్నారు. అయితే.. గత 24 ఏళ్లలో విండీస్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. దాంతో.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలంటే షాయ్ హోప్(Shai Hope) బృందం సర్వశక్తులు ఒడ్డాల్సిందే.
భారత పర్యటనలో ప్రతిసారి ఓటమిని వెంటేసుకునే వెస్టిండీస్ మరోసారి వచ్చేసింది. గత 24 ఏళ్ల ఒక్కటంటే ఒక్క వన్డే సిరీస్ కూడా గెలుపొందని విండీస్ ఈసారి పక్కా వ్యూహంతో ఆడాలనుకుంటోంది. చివరిసారిగా 2002లో విజయం సాధించిన కరీబియన్ టీమ్ చరిత్రను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. తిరువనంతపురంలో ఆదివారం తొలి మ్యాచ్ ఉన్నందున కోచ్ డారెన్ సమీ (Daren Sammy) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.
West Indies head coach Daren Sammy is hopeful of a strong fight from his boys! 👊👀🗣️#INDvWI #ODIs #Cricket #Sportskeeda pic.twitter.com/2cLDgwgZ9u
— Sportskeeda (@Sportskeeda) September 25, 2026
‘భారత్‌లే మేము 24 ఏళ్లుగా ఒక్క సిరీస్ కూడా గెలవలే. కాబట్టి.. చరిత్రను తిరగరాసేందుకు ఈ పర్యటన మాకు అద్భుత అవకాశం. మాకు మేమ సవాల్ విసరుకుంటూ.. వన్డేల్లో మేము ఎక్కడ ఉన్నామో తెలుసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. అందుకని టీమిండియాపై మంచి ప్రదర్శన కనబరిచి 24 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వన్డే సిరీస్‌ను పట్టేయాలని అనుకుంటున్నాం’ అని సమీ పేర్కొన్నాడు.
4-3తో విజయం
ఒకప్పుడు మేటి జట్టుగా ప్రపంచ క్రికెట్‌ను శాంసించిన వెస్టిండీస్ ఈమధ్య దారి తప్పింది. స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్స్‌కు ప్రధాన్యమివ్వడం, బోర్డుతో విబేధాలు.. వంటివి విండీస్ క్రికెట్‌ను నాశనం చేశాయి. ఈ పరిస్థితుల్లో.. నేరుగా వన్డే ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించలేదు కరీబియన్ టీమ్. ఫలితంగా.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడనుంది. చివరిసారిగా భారత గడ్డపై 2002లో వన్డే సిరీస్ గెలుపొందింది విండీస్. అప్పుడు 7 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-3తో సొంతం చేసుకుందీ మాజీ వరల్డ్ ఛాంపియన్.
The #WestIndies have announced their squads for the upcoming tour of India! 👀🚨#INDvWI 👉 1st ODI 👉 SUN, 27th SEP, 1 PM pic.twitter.com/TePQdrVRLO
— Star Sports (@StarSportsIndia) September 19, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

