Asian Games : నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ (Manpreet Kaur) మెరిసింది. అంచనాలు నిలబెట్టుకున్న తను మహిళల విభాగంలో కాంస్యం కొల్లగొట్టింది. శుక్రవారం ఫైనల్లో ఇనుప గుండును 17.17 మీటర్ల దూరం విసిరిన మన్‌ప్రీత్ కంచు మోత మోగించింది. తద్వారా ఆసియాడ్ మహిళల షాట్‌పుట్‌లో పతకం సాధించిన మూడో భారత మహిళగా చరిత్రకెక్కింది తను. అథ్లెటిక్స్‌లో పతకం గెలుస్తారనుకున్న గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్(Animesh Kujur)లు 100 మీటర్ల పరుగులో తేలిపోయారు.
జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. షూటర్లు పసిడి వెలుగులు విరజిమ్మగా.. టేబుల్ టెన్నిస్‌లో మిక్స్డ్ డబుల్స్ టీమ్ కాంస్యం పట్టేసింది. వీరి స్ఫూర్తితో షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ పోడియం మీద సగర్వంగా నిలబడింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సత్తా చాటిన తను.. ఇనుప గుండును 17.17 మీటర్ల దూరం విసిరింది. మూడో స్థానం సాధించి.. కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది మన్‌ప్రీత్.
ANOTHER MEDAL FOR INDIA…
36 year old Manpreet Kaur WINS BRONZE in Women’s Shot Put. WHAT A POWERFUL WIN!!!
Watch her winning throw#Asiangames2026 #nagoya2026 #manpreet #shotput pic.twitter.com/ts4fYBFTbp
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 25, 2026
అంతేకాదు.. ఈ విభాగంలో పతకం గెలిచిన మూడో భారత మహిళగా మన్‌ప్రీత్ చరిత్ర లిఖించింది. ఆమె కంటే ముందు.. బర్బరా వెబ్‌స్టర్(1951లో), కిరణ్ బలియన్(2023లో) కాంస్యంతో మెరిశారు. మన్‌ప్రీత్ పోడియంపై నిల్చోగా.. ఇదే విభాగంలో కృష్ణ జయశంకర్ మీనన్ 16.5 మీటర్ల దూరంతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
𝐌𝐚𝐧𝐩𝐫𝐞𝐞𝐭 𝐊𝐚𝐮𝐫 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐭𝐡𝐞 𝐭𝐡𝐢𝐫𝐝 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐭𝐨 𝐰𝐢𝐧 𝐚 𝐦𝐞𝐝𝐚𝐥 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐰𝐨𝐦𝐞𝐧’𝐬 𝐬𝐡𝐨𝐭 𝐩𝐮𝐭 🥉🇮🇳
Barbara Webster (1951) and Kiran Baliyan (2023) are the only other Indians to medal in this event. Both won bronze medals.
📸: Hindu… pic.twitter.com/AjQe8x3FGa
— Sportstar (@sportstarweb) September 25, 2026
పురుషుల 100 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్లు విఫలమయ్యారు. క్వాలిఫయింగ్ రౌండ్లో మెరిసిన వీరు.. సెమీస్‌లో మాత్రం నిరాశపరిచారు. గురిందెర్విర్ 10.32 సెకన్లతో ఐదో స్థానంలో నిలవగా.. అనిమేశ్ 10.38 సెకన్లతో ఏడో స్థానంలో ఉండి ఫైనల్ బెర్తు చేజార్చుకున్నారు. దాంతో.. ఈ ఈవెంట్లో భారత పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న వీరిద్దరూ ఉత్త చేతులతోనే స్వదేశం రానున్నారు.
INDIA’S OTHER FASTEST MAN CRASHES OUT OF THE MEN’S 100M SEMIFINALS.
Animesh Kujur finishes 7th in 10.38s in his semifinal at the Asian Games.
Joeljin Nwamadi — 10.17s
Mohd Muhammad — 10.25s
Yuki Koike — 10.31s#AsianGames2026 #IndianAthletics #Athletics #NNISSports…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 25, 2026