New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు
New World Map: మెర్కేటర్ మ్యాప్ శకం ముగియనున్నది. ఇక వినియోగంలోకి కొత్త వరల్డ్ మ్యాప్ రానున్నది. ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానం పాస్ అయ్యింది. ఆ కొత్త మ్యాప్ తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటేసింది.
న్యూయార్క్: కొత్త ప్రపంచ పటాన్ని(New World Map) రూపొందిస్తున్నారు. దీని కోసం ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని పాస్ చేశారు. ఆ తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటు వేసింది. వివిధ ఖండాలకు చెందిన భూభాగాన్ని మరింత కచ్చితత్వంగా చూపేందుకు కొత్త ప్రపంచ పటాన్ని రూపొందిస్తున్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో శుక్రవారం 193 సభ్య దేశాలు ఆ తీర్మానాన్ని ఆమోదించాయి. కరెక్ట్ ద మ్యాప్ అనే తీర్మానాన్ని యూఎన్‌లో ఆమోదించారు. భూగోళంలో ఉన్న ప్రాంతాలను సమంగా చూపించాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేపట్టారు. ముఖ్యంగా ఆఫ్రికాను దృష్టిలో పెట్టుకుని కొత్త వరల్డ్ మ్యాప్‌ను రూపొందించారు. టోగో దేశం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఆ తీర్మానానికి అనుకూలంగా 164 దేశాలు ఓటు వేశాయి. ఈస్టోనియా, జార్జియా, లిథువేనియా, మాల్డోవా, సెర్బియా, ఉక్రెయిన్ దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. కేవలం ఒక్క అమెరికా మాత్రమే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది.
16వ శతాబ్దంలో రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్ ద్వారానే ఇంకా ప్రపంచ వ్యాప్తంగా నావిగేషన్ ప్రక్రియ సాగుతోంది. విద్యా సంస్థలు, మీడియా, డిజిటల్, అఫీషియల్ వ్యవహారాల్లోనూ మెర్కేటర్ మ్యాప్‌ను ఫాలోఅయ్యేవారు. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఆ మ్యాప్‌లో తేడాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజా మ్యాప్‌తో ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దక్షిణాసియా భూభాగాల్లో మార్పులు జరగనున్నట్లు తీర్మానం ద్వారా వెల్లడవుతోంది.
యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ సందర్భంగా భారత ప్రతినిధి రఘూ పురి మాట్లాడారు. కచ్చితత్వంతో కూడిన భూగోళ పటాన్ని రూపొందించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. భౌగోళిక సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మ్యాప్‌లు కీలక పాత్ర పోషించనున్నట్లు ఆయన చెప్పారు. ఈక్వల్ మ్యాప్ ఏరియా ప్రొజెక్షన్స్కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
#WATCH | New York, US: The United Nations General Assembly officially adopted the ‘Correct the Map’ resolution by a vote of 164 to 1, marking a historic shift away from the traditional Mercator projection in favor of more accurate, equal-area representations like the Equal Earth… pic.twitter.com/DaN6MlULGK
— ANI (@ANI) September 5, 2026
మారనున్న ఆఫ్రికా ఖండం సైజు..
మెర్కేటర్ మ్యాప్‌లో వాస్తవాని కన్నా ఎక్కువ సైజులో కొన్ని ఖండాలు, దేశాలు ఉన్నాయి. ఈక్వేటార్కు దూరంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్.. మెర్కేటర్ మ్యాప్‌లో ఆఫ్రికా కన్నా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి గ్రీన్‌ల్యాండ్ కన్నా ఆఫ్రికా 14 రెట్లు పెద్దది. ఇక కొత్త వరల్డ్ మ్యాప్‌తో ఆ సైజులో క్లారిటీ రానున్నది. ఉత్తర యూరోప్, ఉత్తర అమెరికాను కూడా పాత మ్యాప్‌లో ఈక్వేటర్ దగ్గర ఉన్న దేశాల కన్నా ఎక్కువ పెద్ద సైజులో చూపించారు. అయితే కొత్త మ్యాప్‌తో ఆ సైజుల్లో మార్పులు జరగనున్నాయి. మ్యాప్ తమకు సమస్య కాదు అని, కానీ ప్రపంచం మమ్మల్ని మ్యాప్‌ల ఆధారంగా అర్థం చేసుకుంటుందని టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ దుస్సే తెలిపారు. మ్యాప్‌ల ద్వారా ఆఫ్రికా సైజు మారదు అని, కానీ ఆఫ్రికా ఖండం గురించి ప్రజల ఆలోచన మారుతుందని కొందరంటున్నారు. మ్యాప్ మార్పు తీర్మానాన్ని ఆఫ్రికా యూనియన్ స్వాగతించింది.
2018లో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ చేశారు. మెర్కేటర్ మ్యాప్‌లా కాకుండా.. వాస్తవ సైజుకు దగ్గరగా ఖండాల భూభాగాన్ని ఆ మ్యాప్‌లో చూపించాలనుకున్నారు. ఇక ఆఫ్రికా ఎంత పెద్ద సైజులో ఉందో .. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ ప్రకారం అంతే సైజులో కనిపించనున్నది. మెర్కేటర్ మ్యాప్‌లో పెద్దగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ఇప్పుడు కొత్త మ్యాప్‌తో తన సైజ్‌ను కోల్పోనున్నది. అయితే ఈ అంశాన్ని అమెరికా వివాదంగా మార్చింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అమెరికా.. ఇది సైద్ధాంతిక చర్య అని విమర్శలు చేసింది. మెర్కేటర్ మ్యాప్ బదులుగా కొత్త మ్యాప్‌లను ప్రోత్సహించనున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారట్ తెలిపారు. ఇక వివాదాస్పద భూభాగాల అంశంలో మరో ఆందోళన మొదలైంది. ఈక్వెల్ ఎర్త్ మ్యాప్ ప్రకారం ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని రష్యా ఆక్రమించినట్లుగా ఉంది. దీంతో ఆ మ్యాప్ విధానాన్ని ఉక్రెయిన్ వ్యతిరేకించింది. ఓటింగ్‌లో ఉక్రెయిన్ పాల్గొనలేదు. తీర్మానానికి యురోపియన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. మ్యాప్‌లు మారినా బోర్డర్లు మారవని ఈయూ పేర్కొన్నది.
పర్ఫెక్ట్ మ్యాప్ ఏదీ లేదన్న అభిప్రాయం కూడా వెల్లడైంది. భూమి గుండ్రంగా ఉన్నా.. మ్యాప్‌లు మాత్రం ఫ్లాట్‌గా ఉన్నాయన్నారు. విస్తీర్ణం, ఆకారం, దూరం, డైరెక్షన్ అంశంలో మ్యాప్‌లో మార్పులు ఉండనున్నాయి. అప్పట్లో మెర్కేటర్ మ్యాప్‌ను ప్రత్యేక అవసరాల కోసం క్రియేట్ చేశారు. నేవిగేషన్ ఆ మ్యాప్‌కు బలం. నావికులు ఆ మ్యాప్‌లో ఉన్న స్ట్రెయిట్ లైన్ల ద్వారా ప్రయాణం చేసేవారు. దేశాల, ఖండాల సైజును మాత్రం మ్యాప్‌తో పోల్చలేమన్నారు. యూఎన్ తీర్మానంలో మెర్కేటర్ మ్యాప్‌ను బ్యాన్ చేయలేదు. ప్రభుత్వాలు, స్కూళ్లు, టెక్నాలజీ కంపెనీలు ఆ మ్యాప్‌ను రిప్లేస్ చేయాలని కూడా ఆ తీర్మానంలో కోరలేదు. కేవలం భూమి సైజుతో పోలుస్తూ.. ఈక్వెల్ ఏరియా మ్యాప్‌లను ప్రోత్సహించాలని యూఎన్ భావిస్తున్నది. ఈ ప్రతిపాదనకు భారత్ కూడా మద్దతు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

