Heart Attack | ఓ యువకుడు ఎన్నో కలలు కన్నాడు.. వాటిని సాకారం చేసుకునేందుకు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తి చేయనున్నాడనగా.. ఊహించని విధంగా గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారకమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పవన్ రెడ్డి(24) అనే యువకుడు రెండేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు. ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన పవన్ మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకోబోతున్నాడు. అయితే ఇంతలోనే అతనికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. శుక్రవారం స్నేహితులతో గడిపిన పవన్ రెడ్డికి శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశాడు.
కోమటిరెడ్డి పవన్ రెడ్డి చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పవన్ రెడ్డి స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?