Anil Ravipudi | సినిమా ప్రమోషన్ల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి అనుసరిస్తున్న స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తనదైన పంథాలో కొత్త ఐడియాలను అప్లై చేస్తూ, ప్రతి సినిమాను విడుదలకు ముందే ట్రెండింగ్‌లో ఉంచడంలో అనిల్ దిట్ట. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచే వరుసగా క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు అనిల్. సినిమాతో సంబంధం ఉన్న ప్రతి అంశాన్ని ప్రమోషన్‌గా మార్చి వైరల్ చేయడంలో మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు. లేటెస్ట్గా అనిల్ రావిపూడి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి… ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు” అంటూ అనిల్ షేర్ చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరంజీవి కెరీర్‌లోని క్లాసిక్ సినిమాలు.. ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ముఠామేస్త్రీ, అంజి, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్ వంటి చిత్రాల సెట్స్‌కు అనిల్ వెళ్లినట్టుగా ఏఐ వీడియోను రూపొందించారు. మెగాస్టార్‌తో కలిసి ఉన్నట్టుగా చూపిస్తూ తన అభిమానాన్ని వినూత్నంగా ఆవిష్కరించారు.
వింటేజ్ చిరుని పరిచయం చేస్తూ రూపొందించిన ఈ వీడియో మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. నెట్టింట ఈ వీడియోకు భారీ స్పందన వస్తుండగా, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో కొంత మంది నెటిజన్లు మాత్రం “అనిల్ ప్రమోషన్ స్ట్రాటజీ మామూలుగా లేదు… సినిమా కోసం ఏదీ వదలడం లేదుగా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, 2026 సంక్రాంతికి కూడా అదే ఫీట్‌ను రిపీట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ తో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 12న భారీ స్థాయిలో విడుదల కానుంది. అలాగే వెంకీ మామ (వెంకటేష్) ఈ మూవీలో తొలిసారి చిరంజీవితో కలిసి గెస్ట్ రోల్లో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Going with the trend 😃👌🏻
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు🥳🥳🥳
Thanks to AI 😄
(‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు 😉)#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/o23yvZOlMw— Anil Ravipudi (@AnilRavipudi) December 21, 2025