Mysaa | కన్నడ భామ రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ మైసా (Mysaa). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రష్మిక మందన్నా ఇదివరకెన్నడూ కనిపించని నయా అవతార్‌లో కనిపించనున్నట్టు హింట్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా మరో క్రేజీ వార్తను షేర్ చేశారు. మైసా ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 24న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రంలో రష్మిక మందన్నా గోండ్ గిరిజన మహిళగా కనిపించనుందని పోస్టర్లతో తెలుస్తోంది. మైసా సినిమాతో Rawindra Pulle డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. పుష్ప ప్రాంచైజీలో శ్రీవల్లిగా డీగ్లామరస్ రోల్లో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన రష్మిక మందన్నా మరి గోండు గిరిజన మహిళగా ఎలా మెప్పించబోతున్నదన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ మూవీలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తుండగా.. కల్కి 2898 ఏడీ చిత్రానికి పనిచేసిన ఆండీ లాంగ్ గ్యుయెన్ స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ డెబ్యూ డైరెక్టర్ ఇటీవలే మైసా నుంచి రష్మిక మందన్నా అగ్రెసివ్ లుక్ లాంచ్ చేసి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. కేరళలోని అథిరప్పిల్లీలో షూటింగ్ షురూ అయినట్టు ఇప్పటికే మేకర్స్ అప్డేట్ అందించారు.
The world will remember her name 🔥#MYSAA the first glimpse on 24.12.25 ❤️🔥#RememberTheName@RawindraPulle @jakes_bejoy @kshreyaas #AndyLong @unformulafilms #SaiGopa @AjaySaipureddy #AnilSaipureddy @srikanthsathi10 @TSeries @tseriessouth pic.twitter.com/WPLwEKYq9a
— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2025
Samantha | ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మొన్న నిధి.. నిన్న సమంతని వేధించిన ఆకతాయిలు