Samantha | ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మొన్న నిధి.. నిన్న సమంతని వేధించిన ఆకతాయిలు
Samantha | కాలం మారినా కొందరి ప్రవర్తన మాత్రం మారడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనలు, సమాజంలో కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభుకు హైదరాబాద్‌లో ఎదురైన అనుభవం ఇందుకు ఉదాహరణగా మారింది.
Samantha | కాలం మారినా కొందరి ప్రవర్తన మాత్రం మారడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనలు, సమాజంలో కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభుకు హైదరాబాద్‌లో ఎదురైన అనుభవం ఇందుకు ఉదాహరణగా మారింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సిరిమల్లె శారీస్ షోరూమ్ ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. ఆమెను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సమంత బయటకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా జనం చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడుతూ తోపులాటకు దిగారు. కొందరు అత్యుత్సాహంతో ఆమె ముఖానికి దగ్గరగా ఫోన్లు పెట్టి ఇబ్బంది పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
రద్దీని నియంత్రించడం కష్టంగా మారడంతో సమంత కారు వరకు చేరుకోవడమే కష్టసాధ్యమైంది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది తీవ్ర ప్రయత్నాల తర్వాత ఆమెను జనం నుంచి తప్పించి కారులో పంపించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనూ సమంత సహనం కోల్పోకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదే తరహా ఘటన వారం రోజుల క్రితం కూడా చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని లులు మాల్లో జరిగిన ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ పాట విడుదల కార్యక్రమంలో నటి నిధి అగర్వాల్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. ఆ సమయంలో నిధి అగర్వాల్ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు సీరియస్‌గా స్పందించి, అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించారని, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని లులు మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల పట్ల అభిమానం ఉండొచ్చు కానీ, కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు. దక్షిణాదిలో అభిమానం హద్దులు దాటుతోందని, కొందరు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నటీమణుల భద్రత విషయంలో నిర్వాహకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg
— Cineholic (@Cineholic_india) December 21, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- fans
- raj nidimoru
- Samantha
- selfies
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

