Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బాలయ్య బాబు ఇప్పటికే ప్రత్యేకమైన సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమాలోని ఓ కీలక స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ యంగ్ గెటప్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆ యంగ్ లుక్‌ను పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేయడానికి ప్రస్తుతం బాలయ్య తన ఫిజిక్, లుక్‌పై ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నారట. లుక్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, పాత్రకు తగ్గట్లుగా మారేందుకు కసరత్తులు చేస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ యంగ్ గెటప్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని, అభిమానులకు గూస్బంప్స్ ఇవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కొంత హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ మహరాజు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. పవర్, గ్రాండ్‌నెస్, మాస్ ఎలివేషన్లతో పాటు చారిత్రక వైభవాన్ని కూడా తెరపై చూపించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని గట్టిగానే కృషి చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్, విజువల్స్ విషయంలో ఆయన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. బాలయ్య – నయనతార జోడీ తెరపై మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాపై దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
“గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది” అని ఆయన చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఇది 111వ ప్రాజెక్ట్ కావడం మరో ప్రత్యేకత. ఈ కారణంగానే ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పీరియాడిక్ టచ్, యంగ్ గెటప్ ఎపిసోడ్ వంటి అంశాలు ఈ సినిమాను బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలిపే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి NBK 111పై అధికారిక అప్డేట్స్ కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సౌండ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.