We should work for the development of the country
కోదాడ, నవంబర్ 26 : కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సంఘాలు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ పౌరులందరూ రాజ్యాంగ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కృషి చేయాలన్నారు. రాజ్యాంగ ఆవిర్భావంతోనే దళితులకు సముచిత న్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పౌర హక్కులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమాల్లో గుండెపంగు రమేశ్, చీమ శ్రీనివాసరావు, కర్ణ సుందర్ బాబు, చింతా బాబు మాదిగ, చిన్ని మాదిగ, గంధం యాదగిరి, కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.