తాండూర్ : లయన్స్ క్లబ్ ( Lions Club ) ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలను ప్రజలతో మమేకమూ చేయాలని లయన్స్ క్లబ్ 320 జీ గవర్నర్ సింహరాజు కోదండరామ్ ( Kodandaram ) అన్నారు. తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్‌ను లయన్స్ గవర్నర్ సందర్శించి క్లబ్ నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ క్లబ్ తరుఫున చేపట్టవలసిన కార్యక్రమాల ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనను క్లబ్ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ ఎల్‌సీఎఫ్ లీడర్ దీపక్ బట్టాచార్య సహకారంతో 100 దోమతెరలను (Mosquito nets) పేదవారికి పంపిణీ చేసేందుకు తాండూర్ లయన్స్ క్లబ్‌కు అందజేశారు.
అంతకు ముందు ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ రెక్కల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా డయాబెటిక్ (మధుమేహం), బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు గాలేవెళ్లి వెంకటి, లక్ష్మయ్య, రమేష్, డీ నారాయణరావు, దేవులపల్లి రాజయ్య, బొమ్మ బాపురెడ్డి, రౌతు వెంకటేశం, తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దేవరకొండ రాజయ్య, సెక్రటరీ బాల ప్రసాద్ కుమార్, ట్రెజరర్ కేశెట్టి సంతోష్ కుమార్, ఫాస్ట్ ప్రెసిడెంట్ సిరంగి శంకర్, ఉపాధ్యక్షులు ఠాకూర్ ఉమ్రాసింగ్, మద్దికుంట రామచందర్, తాటిపాముల సాంబమూర్తి, ఎలుక రామచందర్, తోగరు శ్రీనివాస్ పాల్గొన్నారు.