Andrea | కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కించిన హార్రర్ మూవీ పిశాచి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత పలు భాషల్లో కూడా రీమేక్ అయింది. ప్రస్తుతం మిస్కిన్ ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌పై పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో తమిళ నటి, గాయని ఆండ్రియా జెర్మియా లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సీక్వెల్ పలు ఆర్థికపరమైన చిక్కులతో ఆలస్యమవుతూ వస్తోంది.
ఇదిలా ఉంటే పిశాచి 2లో న్యూడ్ కంటెంట్ ఉండబోతుందని నెట్టింట పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆండ్రియా. స్క్రిప్ట్ దశలో న్యూడిటి ఉండేది.. కానీ షూటింగ్ వరకు వచ్చే సరికి మిస్కిన్ సార్ ఆ పోర్షన్లను తీసేశారు. దానికి గల కారణమేంటనేది మాత్రం తనకు తెలియదని ఆండ్రియా చెప్పింది.
పిశాచి 2లో న్యూడిటీ లేదు.. కానీ చాలా ఎరోటిక్ సీన్లుంటాయి. మిస్కిన్ సార్ ఈ సినిమాను మనుగడ (అస్తిత్వం)కోసం చేయడం లేదు. గతంలో ఆయన చాలా మంది పెద్ద హీరోలతో పనిచేశారు. అలాంటి డైరెక్టర్ ఓ పాత్ర కోసం నన్నేదైనా చేయాలని అడిగితే.. నేను ఆయన విజన్ నమ్మాలి. ఆయన ఉద్దేశం వేరే ఉంది. కొంతమంది నా స్కర్ట్‌ను కూడా కిందకి లాగమని అడిగారని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ హార్రర్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కామియో రోల్లో నటిస్తుండగా.. పూర్ణ, సంతోష్ ప్రతాప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై టీ మురుగనంథం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో థ్రియాట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.
#Andrea about the bold scene in #Pisasu2:
“Nud# scenes was there during writing. But while shooting he removed that scene. There are erotic scenes in the film, but there is no nudity. Mysskin sir is not doing Pisasu2 for survival. He has done many films with Big artists. If such… pic.twitter.com/wMJf1UuGx4
— Cinema Calendar (@CinemaCalendar) November 26, 2025
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం