Imran Khan | మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత హత్యకు గురయ్యారంటూ ప్రచారం జరుగుతున్నది. జైలులో ఉన్న ఆయనను హింసించి చంపారని.. నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు పాల్పడ్డారని వార్తలు వైరల్‌గా మారాయి. అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉన్నది అన్నది మాత్రం తెలియలేదు. పాక్ ప్రభుత్వం ఈ అంశంపై స్పందించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు, ఇతర కుటుంబ సభ్యులను మంగళవారం జైలులోకి అనుమతించకపోవడంతో అనుమానాలకు తావిచ్చింది. ఇమ్రాన్ హత్య వార్తల నేపథ్యంలో నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు మంగళవారం రాత్రి చేరుకున్నారు. తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ పీటీఐ మద్దతుదారులతో పాటు తమపై పోలీసులు దాడి చేశారని వారు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఉంటున్నారు. మూడువారాలకు నుంచి తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించడం లేదని పేర్కొన్నారు.
జైలు వద్ద పోలీసులు తమపై క్రూరంగా దాడి చేశారని.. ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి ప్రయత్నించడం నేరమని చెప్పినట్లుగా పీటీఐ ఆరోపించింది. అడియాలా జైలు వెలుపల జరిగిన దాడిపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. పంజాబ్ చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు రాసిన వారంతా లేఖ రాశారు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాము శాంతియుతంగా నిరసన తెలుపామని.. రోడ్లపై రోడ్లపై బైఠాయించలేదని.. ప్రజా రవాణాకు అడ్డుపడలేదన్నారు. ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదని.. రెచ్చగొట్టలేదన్నారు. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలోని వీధిలైట్లను నిలిపివేశారని.. ఉద్దేశపూర్వకంగా చీకట్లోకి నెట్టివేశారన్నారు. ఆ తర్వాత పంజాబ్ పోలీస్ సిబ్బంది క్రూరంగా, ప్రణాళికాబద్ధంగా దాడి చేశారని నోరీన్ తెలిపారు. 71 ఏళ్ల ఉన్న తనను జుట్టు పట్టుకుని బలంగా నేలపై పడేయడంతో పాటు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లడంతో తనకు గాయాలయ్యాయని తెలిపారు. క్రూరమైన దాడిలో పాల్గొన్న అన్ని పోలీసు సిబ్బందిపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఖాన్ సోదరీమణులు పంజాబ్ ఐజీపీని డిమాండ్ చేశారు.
పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఆగస్టు 2023 నుంచి పలు కేసుల్లో జైలులో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆయన మరణించారంటూ వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం నెలకుపైగా సమావేశాలపై అప్రకటిత నిషేధం విధించింది. ఖాన్ పూర్తిగా ఒంటరిగా, ఏకాంతంగా నిర్బంధంలో ఉన్నట్లుగా పీఐటీ పేర్కొంది. ఆయన న్యాయవాది ఒకరు మాట్లాడుతూ పుస్తకాలు, కీలకమైన వస్తువులు, న్యాయవాదులకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇక్కడ అటవీ చట్టం అమలులో ఉందని.. పాలించే మృగానికి హక్కులుంటాయని.. మరెవరికీ హక్కులుండవ్ అంటూ ఖలీద్ యూసఫ్ చౌదని ఆరోపించారు. ఖైబర్-పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా ఖాన్‌ను కలవడానికి అనుమతి ఇవ్వలేదు. జైలులో ఉన్న ఇమ్రాన్‌ను కలిసేందుకు అఫ్రిది వరుసగా ఏడు ప్రయత్నాలు చేసినా.. జైలు అధికారులు తిరస్కరించారు. ఓ సైనిక అధికారి నియంత్రిస్తున్నట్లుగా ఆరోపించారు.