Indiramma Atmiya Bharosa | రామగిరి (నల్గొండ) మార్చ్ 23 : పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
ఇవాళ నల్గొండలోని 11,44వ వార్డు ఇందిరమ్మ కాలనీ ఆనంద్ నగర్లలో బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి లేఖపై పట్టణ పేదలతో సంతకాల సేకరణ చేపట్టారు. మార్చి 24న ఆర్డీవో ఆఫీస్ ముందు జరిగే ధర్నా జయప్రదం చేయాలని గ్రూప్ మీటింగ్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి 20 రోజులు పనికి వెళ్లిన భూమిలేని పేద వారికి సంవత్సరానికి రూ.12,000 వేయడం జరుగుతుందని అన్నారు. 2013కు పూర్వం నల్గొండ పట్టణంలో ఏడు గ్రామపంచాయతీలు విలీనం చేశారని.. దాని ద్వారా ఉపాధి హామీ పని కోల్పోవడం జరిగిందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పట్టణాల్లో విలీనం చేసిన గ్రామాలు, వ్యవసాయ ఆధారిత శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయడానికి 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్చి 24న ఆర్డీవో కార్యాలయం ముందు జరుగు మహాధర్నాలో పట్టణ పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, మన్యం చల్క శాఖ కార్యదర్శి సీత వెంకటయ్య, పట్టణ పేదల సంఘం నాయకులు ఫాతిమా, కృష్ణ, సైదమ్మ, సుల్తాన్, సరస్వతి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు