Dry Crops | ప్రభుత్వం ఎండిపోయిన పొలాలను గుర్తించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వపనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఐ (ఎం) మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవాళ నల్గొండ మండలంలోని అప్పాజీపేట గ్రామంలో సీపీఐ (ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన ప్రజాపోరులో భాగంగా ఎండిపోయిన పొలాలను, ఆగిన కాల్వ పనులను రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పంటలు వేశారు.
భూగర్భ జలాలు అంతరించడంతో రైతుల పంటలు చేతికొచ్చే ముందు నిట్ట నిలువునా.. ఎండిపోయి రైతులు మనోవేదనకు గురవుతున్నారని అలాంటి రైతులను గుర్తించి ఎండిన పొలాలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి దోమలపల్లి వరకు సాగునీటికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీడర్ ఛానల్ కాలువకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరును అందించాలని డిమాండ్ చేశారు. కాలువను త్వరితగతిన పూర్తి చేయడం వలన అప్పాజీపేట రాములబండ కాకుల కొండారం, దోమలపల్లి గ్రామాలు సస్యశ్యామలమవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు ఓరుగంటి పాండు, పోషబోయిన బిక్షం లింగయ్య, బొడ్డుపల్లి నగేష్, పోషబోయిన యాదయ్య, ఓరుగంటి వెంకన్న, కాసర్ల యాదయ్య, పోషబోయిన ఆంజనేయులు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు