Geetha Workers | మునుగోడు, ఫిబ్రవరి 25 : గీతా పనివారల సంఘం మునుగోడు నియోజకవర్గ సమావేశం ఇవాళ స్థానిక సీపీఐ ఆఫీసులో ఎరుకల నిరంజన్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గీత వృత్తికి సమగ్ర చట్టం చేసి.. గీత పని వారల సంక్షేమానికి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్కిల్ యూనివర్సిటీలో గీత వృత్తికి సంబంధించిన శిక్షణను కల్పించాలని అన్నారు. అర్హులైన గీత కార్మికులకు వృత్తి పింఛన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి ఉన్నచోట ప్రతి సొసైటీకి వన పెంపకానికి భూమి ఇవ్వాలన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగ సైదులు మాట్లాడుతూ.. చనిపోయిన గీత కార్మికుల పింఛన్‌ను వారి భార్యల పేరు మీద వితంతు పింఛనుగా మార్చాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాలలో తాటి, ఈత, ఖర్జూర చెట్లను పెంచాలని అన్నారు. చెట్లు ఎక్కే గీత కార్మికులందరికీ కాటమయ్య కిట్లను మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సురిగి చలపతి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లె శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన లాలయ్య, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, గంటా నాగేష్, మాధవుని మల్లేష్, ఈదులకంటి కైలాస్, నాతి నరసింహ, మాధగోని మల్లయ్య, ఏ నరసింహ, బి యాదయ్య, జి గాలయ్య పాలకూరి యాదయ్య, గోపగోని సైదులు, కట్కూరి లింగస్వామి, కే శేఖర్, కే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!