Srisailam | శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా బుధవారం భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. నంద్యాల ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీటీవీల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్‌రెడ్డి ఉన్నారు.