Disabled People | చండూర్, మార్చి 04 : పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చండూరులో చెప్పుల దండలు మెడలో వేసుకొని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఇవాళ వికలాంగులు వినూత్న నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయి పార్టీ AICC ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి.. నేడు ఆ హామీని నెరవేర్చకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పాలనా తీరును నిరసిస్తూ.. ఆర్టీసీలో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చండూరులో చెప్పులు మెడలో వేసుకొని తమ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే.. వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగున విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు రూ.6000 పెంచుతామని.. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని హామీనిచ్చారు.
రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని.. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తున్నా.. ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్ తేల్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాం..
పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్వష్టం చేశారు. ముఖ్యంగా తమ వికలాంగుల సామాజిక వర్గం ఓట్లను ఎన్నికల సమయంలో వేయించుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పిటిసిలుగా సర్పంచులుగా, వార్డు నెంబర్లుగా ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు తమ వికలాంగుల సంక్షేమం గురించి తమ అభివృద్ధి గురించి విసుమంత అయినా ఆలోచన చేయకుండా చట్టసభల్లో తమ సమస్యలపై చర్చించకుండా ఉంటున్న తీరు కారణంగానే తాము చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ సాధనకై ఉద్యమించవలసిన పరిస్థితులు దాపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘం చెండూరు మండలం అధ్యక్షులు ఆకారపు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి, జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు, మండల మహిళా అధ్యక్షురాలు కారంగుల రేణుక, చండూరు మండలం ఉపాధ్యక్షులు పల్లగొని రవి, చండూరు మండలం యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మునుగోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు, మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య, సంఘం నాయకులు సిద్దు శివకుమార్ కృష్ణయ్య శైలజ కళావతి నాగమణి నాగమ్మ గోవర్ధన్ రెడ్డి ఈదా పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు