హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి సాగర్ కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ విషాదకర సంఘటన నిడమనూరు మండలం ముకుందాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన దంపతులు తల్లం పుల్లయ్య, పద్మ గల్లంతయ్యారు. డ్రైవర్ సురక్షితంగా బయటపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Santosh Sobhan | కంబ్యాక్ కోసం కాదు, క్లారిటీ కోసమే బ్రేక్ తీసుకున్నా: సంతోష్ శోభన్
Seetha Payanam | ఎమోషన్ అండ్ యాక్షన్ కలయికగా ‘సీతా పయనం’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!