Seetha Payanam | ఎమోషన్ అండ్ యాక్షన్ కలయికగా ‘సీతా పయనం’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ను వెండితెరకు పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంతో రాబోతున్న చిత్రం 'సీతా పయనం'. ఈ సినిమా ఫిబ్రవరి 14న రాబోతుండగా.. చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయమవుతుండగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. ఒక చెఫ్ అయిన ఐశ్వర్య తన కారులో ప్రయాణిస్తూ, నిరంజన్ అనే తెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. అయితే ఈ ప్రయాణంలో వారి మధ్య సాగే సరదా సంభాషణలు, ఎదురయ్యే మలుపులు ఏంటి అనేది సినిమా కథ.
ఈ సినిమాలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. అర్జున్ సర్జా ఒక పవర్ ఫుల్ పాత్రలో మెరుస్తున్నాడు. ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా స్పెషల్ కామియో రోల్లో కనిపించబోతున్నాడు. మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

