Collector Ila Tripathi | నల్గొండ విద్యాభిభాగం (రామగిరి) మార్చి 6: వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే నీట్-2025 ప్రవేశపరీక్ష నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇవాళ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి పరిశీలించారు. యూనివర్సిటీకి వచ్చిన ఆమెకు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఎంజీయూలోని ఆర్ట్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, సైన్స్ కళాశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి రిజిస్ర్టార్ అల్వాల రవిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాన్ని కేటాయించినచో అన్ని మౌలిక సదుపాయాలతో పటిష్టంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆమె కోరారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, నల్గొండ ఎంఈఓ కత్తుల అరుంధతి, ఎంజీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రియ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి,. పలువురు అధికారులు తదితరులున్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు