BRSV | ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్వీ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల ఐదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థుల పరీక్షలకు అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆర్టీసీ ఆర్ఎం ప్రత్యేక బస్సులు నిర్వహించాలని , ట్రాన్స్కో విద్యుత్ శాఖ వారు కరెంటు పోకుండా చూడాలన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో తాగునీరు తరగతి గదులలో ఫ్యాన్లు ఉండే విధంగా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఇంటర్మీడియట్ అధికారులను కోరారు.
అదేవిధంగా ఎండ తీవ్రత పెరగడం వలన విద్యార్థులకు అందుబాటులో డాక్టర్లను, అంబులెన్సు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం చేతి గడియారాలను అనుమతి ఇవ్వాలన్నారు. ఎందుకంటే విద్యార్థులకు సమయం తెలవకపోవడం వలన పరీక్ష సరిగ్గా రాయలేక పోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.
కాబట్టి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అన్ని మౌలిక వసతులు కల్పించి విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చామకూరి లింగస్వామి గౌడ్, నోముల క్రాంతి యాదవ్,గంట కిరణ్ ముదిరాజ్, తిరుమల సైదులు శాలివాహన,శంకర్, గణేష్, నరేష్, సురేష్, మహేష్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
SLBC Tunnel MIshap | కార్మికుల