Supreme Court: షాదీ డాట్‌కామ్ ఓనర్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
Supreme Court: షాదీ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌కు సుప్రీంకోర్టులో ఇవాళ తాత్కాలిక ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు అతన్ని అరెస్టు చేయవద్దు అని కోర్టు చెప్పింది. మాట్రిమోనియల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగిన ఫ్రాడ్ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.
న్యూఢిల్లీ: షాదీ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ తాత్కాలిక ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు అతన్ని అరెస్టు చేయవద్దు అని కోర్టు చెప్పింది. మాట్రిమోనియల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగిన ఫ్రాడ్ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఈ కేసులో అనుపమ్ మిట్టల్‌తో పాటు మరో ఇద్దరికి కూడా రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. అయితే ఈ కేసును మళ్లీ హైకోర్టుకు పంపించింది.
తాత్కాలిక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని మిట్టల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ .. షాదీ డాట్‌కామ్‌పై కేసు నమోదు చేసింది. షాదీ డాట్‌కామ్ ద్వారా ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించిన ఓ వ్యక్తి తనను 11 లక్షలు మోసం చేసినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. యూజర్ సమాచారాన్ని ఆ ఫ్లాట్‌ఫామ్ సరైన రీతిలో వెరిఫై చేయలేదని ఆ మహిళ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

