Michael | పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘మైఖేల్’ (Michael). ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషిస్తుండటం విశేషం. ట్రైలర్లో జాఫర్ తన నటన, డ్యాన్స్ మూమెంట్స్ మరియు బాడీ లాంగ్వేజ్‌తో అచ్చం మైఖేల్ జాక్సన్‌ను గుర్తు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, మైఖేల్ జాక్సన్ చిన్నతనం నుంచి గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని, ఆయన ఎదుర్కొన్న వ్యక్తిగత సవాళ్లను తండ్రి జో జాక్సన్‌తో ఉన్న సంక్లిష్ట సంబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కోల్మన్ డొమింగో, నియా లాంగ్ మైఖేల్ తల్లిదండ్రులుగా నటించగా, మైల్స్ టెల్లర్ కీలకమైన మేనేజర్ పాత్రలో కనిపించనున్నారు.