SLBC Tunnel MIshap | నల్గొండ (రామగిరి) : తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడపై 8 రోజులైనా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వారు ప్రాణాలతో ఉన్నారా..? లేదా.. ఏమిటి..? అనే అంశంపై కార్మికుల కుటుంబ సభ్యులు, కార్మికులు ఆందోళనలో ఉన్నారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
నల్గొండలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి మరమ్మతుల అనంతరం పనులు ప్రారంభిస్తే బాగుండేదని తెలిపారు. ఇలాంటి ఘటన పురావృతం కాకుండా చూడాలని.. జరిగిన విషయంపై న్యాయవిచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు.
పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు 8 రోజులుగా ఆ కార్మికుల జాడ తెలియకపోవడంతో మనోవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఈ విషయంలో కాంట్రాక్టర్, ప్రభుత్వం కార్మికులను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రేక్షక పాత్ర..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ఘటనపై కేంద్రం నామమాత్రంగా బలగాలను పంపించి ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఈ విషయంలో మోడీ ప్రభుత్వం సహాయ చర్యలు అందించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడం సీపీఎం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం నష్టం జరిగిపోయిందని.. ఇది ప్రభుత్వాల వైఫల్యం అని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షత..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై పూర్తి వివక్షతను చూపిందన్నారు. తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రైల్వే బోగీల ఫ్యాక్టరీ తోపాటు తెలంగాణలో పొడిగించే మెట్రో రైల్ ప్రాజెక్టు నిధులు కేటాయించలేదని విమర్శించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళనలకు నిధులు కేటాయించకపోగా దాన్ని వ్యతిరేకించినట్లుగా ఉందని తెలిపారు.
కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ తరపున తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు బండి సంజయ్ , కిషన్ రెడ్డి తోపాటు ఎంపీలు మాట్లాడలేకపోయారని విమర్శించారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చడంలో విఫలం కావడంతోపాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా గాలికి వదిలేసిన ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా వాటి నిర్మాణం జరగలేదన్నారు.
ఓవైపు తెలంగాణలో బీసీ కులగణనకు తాము మద్దతిస్తున్నామంటూనే.. కేంద్రంలో కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. రైతన్నను పూర్తిగా విస్మరించారని.. కార్పొరేట్ శక్తులకు దాసోహం కావడం వల్లనే లక్ష మంది రైతుల హత్య జరిగాయన్నారు.
ఉపాధి హామీ కూలీలకు కేవలం రూ 85 కోట్లు పరిమితం చేశారని దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలంతా అన్యాయం గురి అవుతున్నారన్నారు. దళిత గిరిజనులకు కేటాయింపులు శూన్యం చేశారని, ఎస్సీలకు 16% ఇవ్వాల్సిందిగా.. ఐదు శాతం గిరిజనులకు ఏడు శాతం ఇవ్వాల్సి ఉండగా.. రెండు శాతం బీసీ సంక్షేమాలకు, మైనార్టీలను 3.5 కే పరిమితం చేశారని తెలిపారు.
కార్మికుల స్థితులను గాలికి వదిలేశారని విద్యావ్యాపారం చేసి కేవలం కార్పొరేట్ శక్తులకు దాసోహం అవుతూ నాలుగు శాతమే పెంచాలని తెలిపారు. వైద్యానికి నిధులు లేవన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేశారని తెలిపారు. కేవలం ఒక శాతం ఉండే కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ మిగిలిన శ్రామికుల శ్రమను దోపిడీ చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడైనా ఇల్లు నిర్మించారా అని ప్రశ్నించారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామంటే.. అందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం సరైనది కాదన్నారు.
రాబోయే అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ఆమోదయోగంగా ఉండాలి..
తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఆరోగ్యారంటీలు అమలు అయ్యేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని రైతు భరోసా అందించాలని కూలిపర్వస ఇంతవరకు జాడలేదని మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఊసే లేదన్నారు.
దళిత బంధు రూ 10 లక్షల నుంచి 12 లక్షల పెంచుతామని ప్రజలు పాలు పలికారని అయితే అది ఆచరణ లేదన్నారు.మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని ఇంతవరకు ఎక్కడ కట్టలేదన్నారు ఇల్లు లేని ప్రతి ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసిందన్నారు. తెలంగాణలో చేపట్టిన బీసీ గుణగణ సవరణలు చేయడంతో పాటు 42 శాతం ఆమోదం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా మారిందని సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయని ఈ బడ్జెట్లో రూ.5 వేల కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో కేటాయించాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని ప్రజల పక్షాన ఉండి ఉద్యమాలు చేసి వాటి సాధన కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణపై కేంద్రం వివక్షత చూపుతుందని తెలిపారు. దేశ ప్రజలపై పనుల భారం మోపుతుందని ఎద్దేవా చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే బాటలో ప్రయాణిస్తుందని ఆరోపించారు.
వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి ఉద్యమ నిర్మాణంలో భాగంగా మార్చి 2 నుంచి 31 వరకు పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ఉద్యమాలను నడిపి ప్రజల యొక్క సమస్యలను బహిర్గతం చేసి.. పరిష్కారం దిశగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించకపోవడంతో పాలన కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి పాలన సాగించాలన్నారు.
మార్చి 2 నుంచి 31 వరకు ప్రజా పోరుబాట..
సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. మార్చి 2 నుంచి 31 వరకు ప్రజా పోరుబాట నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 2 నుంచి 6 వరకు ప్రత్యేక బృందాలుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని నివేదికలు చేస్తామన్నారు. ఈ నెల 6, 7న మిర్చి రైతుల సమస్యలు 10 నుంచి 13 వరకు గ్రామీణ ప్రాంతాలలో ఆందోళన కార్యక్రమాలు, ఈనెల 24 నుంచి 26 వరకు మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు, ఈనెల 28న జిల్లా కలెక్టరేట్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు.
ఇప్పటికీ అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారంపై స్పష్టత రాకపోతే ఉద్యమ ఉద్ధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రాష్ట్ర నాయకులు నా రీ ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి బండా శ్రీశైలం బి వెంకటేశ్వర్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు