శనివారం 23 జనవరి 2021
Nagarkurnool - Nov 25, 2020 , 06:24:07

కొనసాగుతున్న కార్తీకమాస పూజలు

కొనసాగుతున్న కార్తీకమాస పూజలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో కార్తీకమాస పూజలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఈనెల 26వ తేదీన శార్వరీ నామ సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున వైష్ణవ ఆలయంలో నెయ్యితో దీపదానోత్సవం నిర్వహించనున్నారు. నెయ్యితో దీపం చేసి నిష్టగల బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని శివపురాణంలో చెప్పినట్లు ఆలయ అర్చకుడు వరదరాజన్‌ అయ్యంగార్‌ తెలిపారు. భక్తులకు నిత్య విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపదానోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.logo