గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - May 28, 2020 , 05:46:33

శ్రీశైలం కుంభకోణంపై రెండో రోజు విచారణ

శ్రీశైలం కుంభకోణంపై రెండో రోజు విచారణ

శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో వెబ్‌సైట్‌ అవకతవకలపై విచారణ పారదర్శకంగా జరుగుతుందని అక్రమార్కులను ఆదిలోనే పసిగట్టి ఉంటే ఇంతటి నష్టం జరిగేదికాదని దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ (ఏడీసీ) రాంచంద్రమొహన్‌ అన్నారు. విచారణలో భాగంగా రెండో రోజు కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు, డీఎస్పీ వెంకట్రావులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవస్థానం నిర్వహించే ఆన్‌లైన్‌ లావాదేవీలు తప్పుదోవ పడుతున్నాయని మొదట్లోనే తేరుకోలేకపోవడం బాధాకరమన్నారు. ఆర్జితసేవా టిక్కెట్లే కాక ఆన్‌లైన్‌ సేవలపై టోల్‌గేట్‌ విరాళాల కౌంటర్‌ పెట్రోల్‌ బంక్‌లను కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఆలయ విభాగంతో సంబంధం ఉన్న అన్ని సెక్షన్‌లలో సమగ్ర విచారణ జరిపించనున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అలసత్వం కనపరచినట్లు ప్రస్పుటమవుతుందన్నారు. అందుకు నిదర్శనం నాలుగు సంవత్సరాలుగా దేవస్థానానికి చెందాల్సిన సొమ్మును పక్కదోవ పట్టించిన అక్రమార్కుల తీరు అని తెలిపారు. వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్‌ మార్పులను చూ స్తుంటే ఎంతో అనుభవంతో ఈ దు శ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. ఇందులో దేవస్థానం నష్టపోయిన డబ్బు ను తప్పక రికవరీ చేస్తామని చెప్పారు. తదుపరి కొనసాగించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఆంధ్రా, ఎస్‌బీఐ పర్యవేక్షణలో ఏజెన్సీ ద్వారా టిక్కెట్‌ కౌంటర్లలో పని చేస్తున్న కొందరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాలు గేళ్లుగా జరుగుతున్న కుంభకోణంలో ఎవరెవరికీ సంబంధం ఉందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. త్వరలోనే గుట్టురట్టు చేస్తామన్నారు. 


logo