Dengue Fever | డెంగ్యూతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్యామ్- పుష్పలత దంపతుల కుమారుడు కుమ్మరి ప్రభాస్ (20) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
పది రోజుల క్రితం ప్రభాస్ అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి మెదక్‌లోని ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోగా డెంగీ వ్యాధిగా నిర్ధారణ అయింది. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించడంతో నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. ప్రభాస్ దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
అందరితో కలుపుగోలుగా ఉండే ప్రభాస్ ఆకస్మికంగా మృతిచెందడంతో ఎస్ కొండాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు కండ్ల ముందే విగతజీవిగా మారిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Tekulapally : గుంతలమయంగా ఎన్‌హెచ్ 930పీ.. వాహదారుల ఇబ్బందులు
YS Jagan | ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు