టేకులపల్లి, సెప్టెంబర్ 04 : భద్రాద్రి కోత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ఇటు కొత్తగూడెం వెళ్లాలన్నా, అటు ఇల్లెందు వెళ్లాలన్నా రహదారి ఇబ్బందికరంగా మారి ప్రయాణం నరక ప్రాయమైంది. ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం నుండి ఇల్లెందు ప్రధాన రహదారిలో నిత్యం వేలాది వాహనాలు తిరగడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేషనల్ హైవే పూర్తయ్యేదెన్నడోనని, రోడ్డు ఇంకా అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యకం చేస్తున్నారు.
ఇటివలే మూడు రోజులు లోడుతో ఉన్న లారీలు గుంతలతో బోల్తా పడ్డాయని, టూ వీలర్స్‌తో ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నట్లు మండల ప్రజలు అవేదన చెందుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణం చేసే రోడ్డుపై పట్టింపులేదనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకుని కనీసం గుంతలనైనా పూడ్చాలని, మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
Tekulapally : గంతలమయంగా ఎన్‌హెచ్ 930పీ.. వాహదారుల ఇబ్బందులు
Tekulapally : గంతలమయంగా ఎన్‌హెచ్ 930పీ.. వాహదారుల ఇబ్బందులు