జెనీవా: ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జెనీవా(Geneva)లో పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ అధికారులు ఆ మీటింగ్‌లో పాల్గొంటున్నారు. ఒకవేళ న్యూక్లియర్ డీల్‌పై తుది నిర్ణయం వెలుబడకుంటే, అప్పుడు ఇరాన్‌పై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెనీవాలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య మూడో దఫా చర్చలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల నుంచి మిడిల్ ఈస్ట్‌లో అమెరికా తన సైన్యాన్ని మోహరిస్తున్న విషయం తెలిసిందే. 2003లో చేపట్టిన ఇరాక్ ఆపరేషన్ తర్వాత భారీ స్థాయిలో అమెరికా దళాలు మిడిల్ ఈస్ట్ చేరుకుంటున్నాయి. ఒకవేళ అమెరికా దాడి చేస్తే, దాన్ని తిప్పికొట్టేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బుసైది నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. అణ్వాయుధం అంశంలో ఇరు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదరడం అనుమానంగా తోస్తోంది. ఇరాన్ సమస్యను పరిష్కరించేందుకు దౌత్యాన్ని ప్రిఫర్ చేస్తానని ట్రంప్ చెప్పినా.. ఆ వత్తిడి తెచ్చేందుకు స్వల్ప స్థాయిలో దాడులు జరపనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.