MLA Sunitha lakshma Reddy | ‘రైతుల కోసం ఎంత చేసినా తక్కువే.. ట్రాక్టర్లుంటే ప్రభుత్వ పథకాలు రద్దు అనే విధానాన్ని ఎత్తివేయాలి..’
MLA Sunitha lakshma Reddy | ప్రభుత్వ పథకాలు రద్దు అవుతున్నాయనే భయంతో రైతులు ట్రాక్టర్లను తీసుకోడానికి వెనకడుగు వేస్తున్నారని, ప్రభుత్వాలే సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఇలాంటి పద్దతిని తొలగించడానికి ఆర్డర్ తీసుకురావాలని అన్నారు.
MLA Sunitha lakshma Reddy | నర్సాపూర్, ఫిబ్రవరి 26 : ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వ పథకాలు అందవనే విధానాన్ని ఎత్తివేయాలని, అవసరమైతే ప్రత్యేక ఆర్డర్ తీసుకురావాలని ఎమ్మెల్యే సునితా లక్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై లబ్దిదారులకు వ్యవసాయ సామాగ్రిని, యంత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు రద్దు అవుతున్నాయనే భయంతో రైతులు ట్రాక్టర్లను తీసుకోడానికి వెనకడుగు వేస్తున్నారని, ప్రభుత్వాలే సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఇలాంటి పద్దతిని తొలగించడానికి ఆర్డర్ తీసుకురావాలని అన్నారు. రైతులు తమ కడుపు నింపుకొని ఇతరుల కడుపు నింపే గొప్ప స్వభావం గల వారని, రైతుల కోసం ఎంత చేసిన తక్కువేనని అన్నారు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో లేక వర్షాలు పడకనో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. రైతులను పెండ్లి చేసుకోడానికి ఎవరు ముందుకు రావడం లేదని, రైతును పెండ్లి చేసుకుంటే రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని కేంద్ర మంత్రి శరత్ పవార్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.
అర్హులైన రైతులందరికి వ్యవసాయ పనిముట్లు..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులకు సునితాలక్మారెడ్డి సూచించారు. వ్యవసాయ పనిముట్లు నర్సాపూర్ నియోజకవర్గానికి 343 మంది రైతులకు మంజూరు అయ్యే అవకాశం ఉందని అన్నారు. కానీ నేడు కేవలం 147 మంది రైతులకు మాత్రమే మంజూరయ్యాయని, ప్రస్తుతం 71 మంది రైతులకు మాత్రమే వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన రైతులందరికి వ్యవసాయ పనిముట్లు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 30140 పద్దతిలో ఈ పనిముట్లను అందజేస్తున్నారని వెల్లడించారు.
వ్యవసాయ పనిముట్లతో రైతులు తమ పని తాము చేసుకుంటారని పైగా పెట్టుబడి తగ్గుతుందని సునితాలక్మారెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు, సబ్సీడీపై విత్తనాలు తదితర పథకాలను తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రేస్ ప్రభుత్వం రైతులకు రూ.15 వేలు ఇస్తామని ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు రావలసిన రైతుభరోసా ఒక్కసారి మాత్రమే రావడం జరిగిందని, ఇప్పటికే రూ.27 వేల కోట్లు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డదని గుర్తు చేశారు. అంతేకాకుండా బోనస్ డబ్బులు కూడా చాలా మంది రైతులకు అందలేదని అది కూడా తక్షణమే అందివ్వాలని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్, తహసిల్దార్ శ్రీనివాస్, ఏడీఏ సంధ్యారాణి, ఏఓ దీపిక, ఏఈవో దుర్గప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు షేక్ హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రైతు రక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మరియు రైతులు పాల్గొన్నారు.



Read Also :
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్‌లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

