Murder | మెదక్, డిసెంబర్ 2 : భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
మంగళవారం ఉదయానికి మంజుల హత్యకు గురికాగా.. భర్త శ్రీశైలం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. భార్యా భర్తల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న టేక్మాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించింది. భార్యా భర్తల మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా