న్యూఢిల్లీ: సంచార్ సాథీ యాప్(Sanchar Sathi App)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా కీలక ప్రకటన చేశారు. స్మార్ట్ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచి సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ యాప్ తప్పనిసరి కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో స్మార్ట్ఫోన్లు తయారు చేసే కంపెనీలకు ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. కచ్చితంగా స్మార్ట్ఫోన్లలో ప్రభుత్వ సంబంధిత సంచార్ సాథీ యాప్ను ప్రీ-ఇన్స్టాల్ చేసి ఉంచాలని పేర్కొన్నది. ఆ ఆదేశాలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. సంచార్ సాథీ యాప్ వల్ల గోపత్యకు భంగం కలిగే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు చెబుతున్నారు.
#WATCH | Delhi | On the debate around Sanchar Saathi app, Union Minister for Communications Jyotiraditya Scindia says, “When the opposition has no issues, and they are trying to find some, we cannot help them. Our duty is to help the consumers and ensure their safety. The Sanchar… https://t.co/Kr3juNrGFq pic.twitter.com/npwm9R1Kf2
— ANI (@ANI) December 2, 2025
ఈ ఏడాది జనవరిలో పంచార్ సాథీ యాప్ ప్రారంభించారు. దాని సాయంతో 7 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేశారు. కాగా ఒక్క అక్టోబర్లోనే 50,000 ఫోన్లు స్వాధీనం అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నవంబర్ 28న ప్రభుత్వం ప్రైవేటుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన స్మార్ట్ఫోన్ కంపెనీలు ఈ యాప్ను ముందుగానే కొత్త మొబైల్ ఫోన్లలో 90 రోజుల్లోపల ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ యాప్ యూజర్లు డిజేబుల్ చేసే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లిపోయిన కొత్త మొబైల్ ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా తయారీదారులు ఈ యాప్ను పంపించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులో ఆదేశించింది.