Farmer | వరి చేను ఎండిపోతుంది.. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక్కసారి కూడా వస్తలేదు : మహిళా రైతు
Farmer | చేతికి రావాల్సిన వరి ఎండిపోతుంటే బాధ అనిపిస్తంది.. ఏడుస్తున్నం. అన్నం కూడా తినడం లేదు. చేతికొచ్చే పంట పోయినప్పుడు మేం చేసి ఏం లాభమున్నది అంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
Farmer | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తికి సరిపోయేంత నీళ్లొచ్చేవని.. పెట్టుబడికి కావాల్సిన డబ్బులు ఇచ్చేది.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పంట పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామంటూ పాలకుర్తికి చెందిన బాధిత రైతులు వాపోతున్నారు. 2 లక్షలు అప్పు చేసి సాగు చేస్తే నీళ్లు లేక పొలం ఎండిపోయిందంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
సదరు మహిళా రైతు మాట్లాడుతూ.. పొట్టమీదున్నవరి చేను ఎండిపోతుంది.. బోరు ఏపిస్తే పడలేదు. 2 లక్షలు అప్పుచేసిర్రు. మనవరాలు ఉంది ఎట్లా.. ? అని కొడుకు, కోడలు ఉరేసుకుని చస్తమంటే.. వీళ్లు వాళ్లు చెప్పంగనే ఆగిర్రు వాళ్లు. మొన్న ఓ సార్ వచ్చి చూసిండు. నిన్న ఓ విలేకరి వచ్చి చూసిండట. రోజూ వచ్చుడు పోవుడే అయితుంది తప్ప నీళ్లయితే అస్సలు వస్తలేవు. మొన్న సార్ వచ్చి ఈ రాత్రే నీళ్లు వదులుతామన్నడు.. మా ఎమ్మెల్యే మేడమ్ యశస్విని రెడ్డి ఒక్కసారి కూడా ఊళ్లెకు చూడటానికి కూడా వస్తలేదని పేర్కొంది.
రేవంత్ రెడ్డి పరిపాలన గురించి అందరికీ అర్థమైతనే ఉన్నది. ఆయన వచ్చి రెండు సంవత్సరాలు అయితున్నది కానీ మాకు పావలా పైసా కూడా పాయిదా లేదని వాపోయింది. ఆ రోజున ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడిండు. చేసే పనితనమైతే ఏం లేదు. చేతికి రావాల్సిన వరి ఎండిపోతుంటే బాధ అనిపిస్తంది.. ఏడుస్తున్నం. అన్నం కూడా తినడం లేదు. చేతికొచ్చే పంట పోయినప్పుడు మేం చేసి ఏం లాభమున్నది అంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
రూ.7 లక్షలు అప్పు చేసి సాగు చేస్తే నీళ్లు లేక పొలం ఎండిపోయిందంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మా ఊరిని చూడడానికి కూడా రావడం లేదు
మా పంట పోతుంటే బాధకి అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు
మాకు రైతు బంధు కూడా ఇవ్వడం లేదు pic.twitter.com/poOChQ2qAn
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Read Also :
Odisha | మద్యం మత్తులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య, కోడలు, మనవరాలి హత్య
Jasveer Singh | ముందుగా రూ.28 లక్షలకు ఒకే చెప్పిన టెకీ.. ఆపై రూ.36 లక్షలిస్తేనే చేరుతానని మెలిక..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

