Child Marriages | రామాయంపేట, ఏప్రిల్ 30 : సమాజంలో బాల్య వివాహాలను అరికట్టడం అందరి బాధ్యత అని విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ రాజు పేర్కొన్నారు. విజన్ ఎన్జీవో డైరెక్టర్ వంగరి కైలాస్ అదేశాల మేరకు ఇవాళ రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో కో ఆర్డినేటర్ రాజు దేవాలయాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలు చేసే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాలలో ఎక్కువ శాతం బాల్య వివాహాలను చేస్తున్నారని.. అందరం కలిసికట్టుగా ఉండి అటువంటి వారిని ఎదిరించాలన్నారు. బాల్య వివాహాలను చేసినా.. ప్రోత్సహించినా వారికి లక్ష రూపాయలు జరిమానాతోపాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అందుకోసం గ్రామాల్లో ఉన్న చర్చి ఫాస్టర్లు, దేవాలయాల పూజారులు, వివిధ మతాలకు చెందిన వారు ఇలాంటి వివాహాలు జరుగకుండా ఆపాలన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం