Toddy rates | చిలిపిచెడ్, అక్టోబర్ 9: చిలిపిచెడ్ మండలంలో కల్లు సీసాకు పది రూపాయలు పెంచొద్దని మండల కేంద్రమైన చిలిపిచెడ్, చండూర్, చిట్కుల్, గౌతాపూర్ గ్రామాల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ గ్రామాల్లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి కల్లు అమ్మకపోవడంతో గ్రామాల్లోని ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో ఇంత జరిగినా ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు.
చిలిపిచెడ్ మండలంలో ఇప్పటివరకు ఐదు రూపాయలు ఉన్న కల్లు సీసాను ఒకేసారి పది రూపాయలు చేయడం కుదరదని.. ధరను పెంచొద్దని కల్లు దుకాణాల యజమానులను రైతులు కోరుతున్నారు. కనీసం ఒక సీసాకు ఒక్క రూపాయి రెండు రూపాయలు పెంచాలి కానీ పది రూపాయలు పెంచడం సరైన అయిన పద్ధతి కాదన్నారు. ఈ గ్రామంలో కల్లు అమ్మకపోవడంతో మహిళలు, వృద్ధులు, రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది అయితే బస్సులపై, ఆటోలపై పక్క మండలం నుంచి కల్లు తెచ్చుకుంటున్నారు.
లాభాలు రావడం లేదని..
ఈ కల్లు దుకాణాలపైన ఎక్సైజ్ అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపైన కల్లు దుకాణాల యజమానులను వివరణ కోరగా.. ఒక సీసాకు ఐదు రూపాయలు కల్లు అమ్మడంతో మాకు సరియైన లాభాలు రావడంలేదని అందుకోసం మండలంలోని అన్ని దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి పది రూపాయల అమ్మాలని ఒప్పుకున్న. సరే ఏది ఏమైనా సరే కాని ఇప్పటికైనా ఏదో ఒక ధరతో కల్లు అమ్మాలని రైతులు, వృద్ధులు కోరుతున్నారు.
చండూర్ గ్రామంలో..
Local Body Elections | స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ.. కీలక ప్రకటన చేసిన ఎస్ఈసీ
KCR | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్