BRS Party | మద్దూరు(ధూళిమిట్ట), మార్చి16 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ మండల నాయకుడు నల్ల బాల్‌రెడ్డి అన్నారు. ఇవాళ మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ. 5లక్షల ఉపాధిహామీ నిధులతో 1వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక బీఆర్ఎస్ నేతలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నల్ల బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అందె భూపతి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నలుసాని లింగారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నలుసాని మోహన్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్లు గవ్వల గణేశ్, బొద్దుల చంద్రమౌళి, బీఆర్ఎస్ నాయకులు నల్ల భూపతిరెడ్డి, కలకోటి నర్సిరెడ్డి, గీకురు మైసయ్య, ఇరుమల్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు