Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి బూతు ప్రసంగాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఇంకా రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడారు. ఆ బూతులు వినడానికే ఒళ్లు జలదరిస్తోంది. ఈ రాష్ట్రంలో తానే పెద్ద నీతిమంతుడిలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని అంటున్నారు. ఈ బూతులకు ఆద్యుడెవరు..? నువ్వు కాదా..? జర్నలిస్టులను పట్టుకుని బట్టలిప్పదీసి రోడ్డుమీద కొడుతాం అని సంస్కారహీనంగా మాట్లాడినవ్. రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉంది. ఆ బూతులు వింటే పిల్లలు చెడిపోతున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్ రెడ్డి నీ భార్యాబిడ్డలే మనషులా..? ఎదుటి వారికి భార్యాబిడ్డలు, అక్కాచెల్లెళ్లు, కుటుంబ సభ్యులు ఉండరా..? నీ దాకావస్తే కానీ నొప్పి తెల్వదా..? గతంలో కేసీఆర్‌ను పట్టుకుని కాల్చి పారేయాలని మాట్లాడినవ్. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని మాట్లాడినవ్. నీ బూతులు నా నోటితో చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అయితది. గతంలో పచ్చి బూతులు మాట్లాడిన నువ్వు.. నిన్ననేమో అట్ల అంటర.. ఇట్ల అంటర అని నీతులు మాట్లాడుతున్నవ్. బాడీ షేమింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా..? కేటీఆర్ కుమారుడిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడినవ్ కదా..? నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినవ్ కదా..? అసలు బాడీ షేమింగ్‌కు రాజకీయాల్లో అవసరం ఉంటదా..? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా..? అసలు నువ్వు మనిషవా..? పశువువా..? అన్నం తినేటోడు అయితే ఇట్ల మాట్లాడడు. రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు. వంద ఎలుకలను తిన్న పిల్లి.. నేను శాఖహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు.. ఇవాళ నీతి సూత్రాలు వల్లిస్తే ఎట్ల రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ప్లే చేసి చూపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు https://t.co/vRDerR069Y pic.twitter.com/81gaeF922Q
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2025