Pending Salaries | పాపన్నపేట, ఏప్రిల్ 30 : గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఇవాళ ఉపాధి హామీ సిబ్బంది ఎంపీడీఓ విష్ణువర్ధన్‌కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి హామీ ఉద్యోగులు నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఏపీఓ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన మేరకు వెంటనే అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు రాము, నాగేందర్, ఇంచార్జి ఈసీ యాదగిరి, టెక్నికల్ అసిస్టెంట్ సుధాకర్, లక్ష్మణ్, బాలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం