Untouchability | నిజాంపేట, ఏప్రిల్ 30 : గ్రామంలో ఎస్సీ, ఎస్టీల పట్ల కుల వివక్షత చూపరాదని ఆర్ఐ ఇమాద్, ఏఎస్ఐ జైపాల్‌రెడ్డి అన్నారు. ఇవాళ నిజాంపేట మండలంలోని తిప్పనగుల్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ఆర్ఐ ఇమాద్, ఏఎస్ఐ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల పట్ల అగౌరవంగా మాట్లాడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలని, అందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామల, సీనియర్ అసిస్టెంట్ రమేశ్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు, గ్రామస్తులు యాదగిరి, చంద్రం, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం